హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జనగణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి'

NDL: జనగణన ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, కచ్చితత్వంతో, నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జీ. రాజకుమారి ఆదేశించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జనగణన కార్యకలాపాల నిర్వహణపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.