హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలు

KMR: సదాశివనగర్ మండలం ఉత్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి కళ్లద్దాలు వాడాలని సూచించారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పౌష్టికాహారం తీసుకోవాలని, కంటి వ్యాయామాలు చేయాలని ఆప్తాల్మిక్ అధికారి హరికిషన్ తెలిపారు.