విశాఖ అక్వాన్ తుఫానును ఎదుర్కొనేందుకు APEPDCL సన్నద్ధమైందని CMD పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. విశాఖలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాల్లో 703 బృందాలు, 8,161 మంది సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. పునరుద్ధరణ పనుల కోసం 24,400 స్తంభాలు, 1,848 ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు. అత్యవసర సేవలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్వాన్ ఎఫెక్ట్...విద్యుత్ సిబ్బంది అప్రమత్తం


