KRNL: ఓర్వకల్లు మండలంలోని కనమడకల గ్రామానికి చెందిన పాల రాజశేఖర్, గిట్ట రామకృష్ణ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కొత్తగా పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన 40 కుటుంబాలు


