SRD: కంగ్టి మండలంలోని రసోల్ గ్రామంలో సర్పంచ్ జారవ్వ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగభవాని మాట్లాడుతూ.. భూ రికార్డుల్లో పారదర్శకత, కచ్చితత్వం పెంచడంతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ రీసర్వే చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఉప రామారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
భూ రీసర్వేపై గ్రామసభ


