హైదరాబాద్: 28°C
తెలంగాణ

'786 మందికి కొత్త పెన్షన్లు మంజూరు'

WNP: గోపాల్‌పేట, ఏదుల మండలాల్లో కొత్తగా 786 మందికి చేయూత పెన్షన్లు మంజూరు కాగా, కలెక్టర్ ఆదర్శ్ సురభి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా 70 వేల మందికి నెలకు రూ.17 కోట్ల పెన్షన్లు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా అందుతుందన్నారు.