హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 19న ఎంపీపీ, 20న జడ్పీ ఎన్నికలు

అల్లూరి జిల్లాలో ఈ నెల 19న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు, 20న జడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేపట్టి, మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తారు. పోటీ ఉన్నచోట మధ్యాహ్నం 3 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.