హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆసక్తికర పోటీ.. సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

ASR: జీకేవీధి మండలం సీలేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి అక్కాచెల్లెళ్లు లక్ష్మి, నీల వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. సీలేరులో జెన్‌కో ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందిన కొర్ర ధను కుమార్తెలైన వీరిద్దరూ మంగళవారం నామినేషన్లు సమర్పించారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఒకే పదవికి పోటీ పడుతుండటంతో స్థానికంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.