WNP: గోపాల్పేట మండలంలో 786 మంది కొత్త పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, రేషన్ కార్డులను ఎమ్మెల్యే మేఘారెడ్డి పంపిణీ చేశారు. వనపర్తి నియోజకవర్గంలో 38 వేల మందికి నెలకు రూ.11 కోట్ల పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభమవుతుందని, కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పిస్తామని వెల్లడించారు.
తెలంగాణ
'ఈ నెల 19 నుంచి కుటుంబ బీమా పథకం'


