హైదరాబాద్: 28°C
వార్తలు

వేలంలో 2.55 లక్షలు పలికిన కొబ్బరికాయ!

భక్తికి వెలకట్టలేం అనడానికి తమిళనాడులో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. థేనిలో వైభవంగా జరిగిన మురుగన్ స్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో ఓ భక్తురాలు అందరినీ ఆశ్చర్యపరిచారు. స్వామివారి పూజా కలశంపై ఉంచిన కొబ్బరికాయను నిర్వాహకులు వేలం వేయగా.. కేవలం దైవానుగ్రహం కోసం ఆమె ఏకంగా రూ.2.55 లక్షల భారీ బిడ్ వేసి దక్కించుకున్నారు. దేవుడి ఆశీస్సుల కోసం ఇంత మొత్తం వెచ్చించడం చర్చనీయాంశమైంది.