NZB: బోధన్ మండలం కొత్తపేట్‌లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిల్వ ఉంచిన పశుగ్రాసానికి ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఎఫ్‌ఓ శంకర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సహాయక చర్యల్లో లీడింగ్ ఫైర్‌ఫైటర్ ఏసురత్నం, పైలట్ భరత్‌రెడ్డి, ఫైర్‌ఫైటర్లు కిరణ్, సురేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
కొత్తపేట్‌లో పశుగ్రాసానికి నిప్పు


