హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO VIRAL: ఎర్ర పీతలతో క్రిస్మస్ ఐలాండ్

ఆస్ట్రేలియా క్రిస్మస్ ఐలాండ్‌లో కోట్లాది ఎర్ర పీతలు అడవుల నుంచి సముద్ర తీరానికి సామూహికంగా వలస వెళ్లడంతో ఆ ద్వీపం మొత్తం ఎర్రటి రంగులోకి మారింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో ఎర్ర పీతలు గుడ్లు పెట్టడానికి ప్రయాణిస్తాయి. రోడ్లు, ఇళ్ల వెనుక భాగాలు, అటవీ మార్గాలు అన్నీ లక్షలాది పీతలతో నిండిపోయి ఎర్రటి తివాచీ పర్చినట్లు కనిపిస్తాయి. ఈ అద్భుత దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.