హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీలో భారీగా పెరిగిన ఓటర్ల సంఖ్య

ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం.. యూపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 13.58 కోట్లకు చేరింది. SIR తర్వాత 18.84 లక్షల మంది కొత్తగా చేరారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే (10.97 లక్షలు) అధికంగా ఉన్నారు. అభ్యంతరాలు, మార్పుల కోసం డిసెంబర్ 16 వరకు అవకాశం కల్పించారు. తుది ఓటర్ల జాబితాను 2027 జనవరి 4న ప్రకటించనున్నారు.