MBNR: మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న నీటి దోపిడీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చడం లేదన్నారు.
తెలంగాణ
నీటి దోపిడీని అడ్డుకోవడంలో విఫలం: రాజేశ్వర్ గౌడ్


