హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా అభయ వీరాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం

కృష్ణా జిల్లా కోడూరు మండలం మందపాకల శివారు పాదాలవారిపాలెంలో శ్రీ అభయ వీరాంజనేయ స్వామి దేవస్థానం 5వ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. జనసేన నాయకులు మండలి వెంకట్రామ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు.