ఢిల్లీలో వరుస భవనాల కూలిన ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా వివేక్ విహార్ పరిధిలోని కస్తూర్బా నగర్లో మరో భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారితో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
వార్తలు
ఢిల్లీలో కుప్పకూలిన మరో భవనం


