హైదరాబాద్: 28°C
వార్తలు

గర్ల్‌ఫ్రెండ్‌తో కేంబ్రిడ్జ్ రెస్టారెంట్‌కు రాహుల్!

ఢిల్లీలో జరిగిన సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' ఆవిష్కరణ సభలో రాహుల్ గాంధీ ఆసక్తికర విషయం పంచుకున్నారు. తన తల్లిదండ్రులు తొలిసారిగా కలుసుకున్న కేంబ్రిడ్జ్ వర్సిటీ రెస్టారెంట్‌కు ఓసారి తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లినట్లు చెప్పారు. తన పేరెంట్స్ కలిసిన చోటు చూడాలనే అక్కడికి వెళ్లానన్నారు. ఈ విషయం రెస్టారెంట్ వ్యక్తికి చెబితే తనకు తెలుసని అన్నాడంటూ రాహుల్ గుర్తుచేసుకున్నారు.