MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలో రూ.1.50 కోట్ల వ్యయంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బాలుర వసతి గృహం అదనపు గదుల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.
తెలంగాణ
'నాణ్యతతో పనులు పూర్తి చేయాలి'


