హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 21న కరీంనగర్‌లో భారీ వర్ష సూచన

KNR: అక్వాన్ తుపాను ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనున్న నేపథ్యంలో, 21న కరీంనగర్ జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే సూచన ఉంది. 22న కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడవచ్చని అంచనా. 20న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు.