ASF: జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. సిర్పూర్(యూ)లో 13.4, తిర్యాణిలో 13.6, కెరమెరి, వాంకిడి మండలాల్లో 15.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. ఉదయం, రాత్రి వేళల్లో చల్లని గాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు చలి తీవ్రత కారణంగా ఉదయం, రాత్రి ప్రయాణాలను తగ్గించాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో చలి తీవ్రత 15.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత


