MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతం 146.90 మీటర్లుగా ఉంది, నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు ప్రస్తుతం 17.1445 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 373 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులో స్థిరంగా నీటిమట్టం


