హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్తపై కర్రతో దాడి.. చికిత్స పొందుతూ మృతి

HYD: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తపై కర్రతో దాడి చేసిన భార్యపై గచ్చిబౌలి PSలో కేసు నమోదు చేశారు. కొండాపూర్‌లోని మసీద్ బండ, CMC లేఅవుట్‌లో ఈ నెల 6న జరిగిన ఘటనలో మొరంపూడి సూరిబాబు(44) తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 11న మృతి చెందాడు. మద్యం మత్తులో భర్త తరచూ వేధింపులకు గురిచేయడంతోనే రమణ(39) దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.