హైదరాబాద్: 28°C
తెలంగాణ

రబీ సాగు వద్దు.. ఇరిగేషన్ శాఖ సూచన

MBNR: మిడ్జిల్ మండలంలోని చెరువుల్లో నీటి నిల్వలు తగ్గడంతో రబీ పంటలు సాగు చేయవద్దని ఇరిగేషన్ శాఖ రైతులకు సూచించింది. ఈ మేరకు ఈఈ ఎన్. రామార్జున్ తహశీల్దార్‌కు లేఖ పంపారు. ఈ నెలాఖరుకు ఎంజీకేఎస్ఐ కాలువను మూసివేయనున్నట్లు, మిగిలిన నీటిని వేసవిలో తాగునీటి అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. దీంతో రబీ సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది.