హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుల్లకోటలో క్షుద్ర పూజల కలకలం

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని గుళ్లకోటలో క్షుద్ర పూజల కలకలం రేగింది. సోమవారం అర్ధరాత్రి గ్రామంలోని పోచమ్మ గుడి సమీపంలో గుంతలు తవ్వి బూడిద గుమ్మడికాయలు పెడుతుండగా ఓ వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.