హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్కుల ప్రవేశ రుసుము రెట్టింపు

HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ పార్కుల్లో ప్రవేశ టికెట్ ధరలు పెరగనున్నాయి. పెద్దలకు రూ.10 నుంచి రూ.20కి, పిల్లలకు రూ.2 నుంచి రూ.5కి పెంచేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. పార్కుల నిర్వహణ కోసమే పెంపు అని అధికారులు చెబుతున్నారు. మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు లేకుండా రుసుము పెంచడంపై కొందరు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.