హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాసాయిపేటలో బైకుల దొంగ పట్టివేత..!

MDK: మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం బైకుల దొంగను గ్రామస్తులు పట్టుకొని బంధించారు. మరో నలుగురితో కలిసి వచ్చిన వ్యక్తిని పట్టుకోగా మిగతా నలుగురు పారిపోయినట్లుగా చెబుతున్నారు. నిందితుడు వద్ద బైక్ తాళపు చెవులు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.