హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం ధరలపై రైతుల ఆవేదన

SRPT: పంట పండించేందుకు రైతులు పడుతున్న కష్టం ఒకవైపు పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు మరోవైపు. జిల్లాలో మిల్లర్లు, ధాన్యం వ్యాపారుల సిండికేట్ కారణంగా వడ్లకు ఆశించిన ధర రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, బియ్యాన్ని మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.