హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకర తేలిన మార్గంపై వాహనాలు ప్రయాణం

NRML: నిర్మల్ గ్రామీణ మండలం తాంశ- కౌట్ల(కె) గ్రామాల మధ్యనున్న రోడ్డు దుస్థితి ఇలా ఉంది. రహదారి నిర్మాణం కోసం చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి. ఫలితంగా ఈ మార్గంలో ప్రయాణించే వారికి అవస్థలు తప్పటం లేదు. కంకర తేలిన మార్గంపై రాకపోకలు సాగించే ద్విచక్రవాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు.