MHBD: బయ్యారం మండలంలోని పాకాల వాగులో సోమవారం చేపల వేటకు వెళ్లిన జాలరికి వింత ఆకారంలో ఉన్న చేప చిక్కింది. తాబేలు ఆకృతిని పోలిన గట్టి కవచంతో ఉన్న ఈ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆసక్తి కనబరిచారు. ఉదయం వలకు చిక్కిన చేప సాయంత్రం వరకు బతికే ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి చేప కనిపించలేదని గ్రామస్థులు తెలిపారు.
తెలంగాణ
పాకాల వాగులో వింత చేప..!


