SRD: కంగ్టి మండల కేంద్రంలోని పాతబస్తీలో పాత బోరు బావికి నూతన మోటారును బిగించి సోమవారం రాత్రి సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ తాగునీటి సరఫరాను ప్రారంభించారు. మిషన్ భగీరథ నీరు రాని రోజుల్లో స్థానికులకు ఈ బోరు నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని, గ్రామంలో ఇప్పటివరకు నాలుగు కొత్త బోర్ మోటార్లు బిగించామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గణపతి, వార్డు సభ్యులు ఉన్నారు.
తెలంగాణ
పాతబస్తీలో బోర్ మోటారును ప్రారంభించిన సర్పంచ్


