హైదరాబాద్: 28°C
తెలంగాణ

విమానాశ్రయం కోసం వాగుల మళ్లింపు

ADB: ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయ స్థలంలో వరద ముప్పు నివారణకు మూడు వాగులను మళ్లించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. కుమ్మరి కుంట, జువ్వికుంట వాగులకు రూ.57.49 కోట్లతో 2.67 కి.మీ. కాలువ, చించుఘాట్ వాగుకు రూ.267.23 కోట్లతో 4.5 కి.మీ. కాలువ నిర్మిస్తారు. నీటిని సాత్నాల ప్రాజెక్టు వైపు వెళ్లే వాగులోకి కలుపుతారు. SE ప్రభు కళ్యాణ్ బృందం ప్రణాళికలు సిద్ధం చేయగా టెండర్లు పిలిచారు.