హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘర్షణలో ఓ యువకుడు మృతి

BDK: భద్రాచలం పట్టణంలో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతిచెందాడు. తెల్లం శరత్‌(24) అనే వ్యక్తి ఓ లాడ్జిలో అద్దె కోసం వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సిబ్బందితో వాగ్వాదం ఘర్షణకు దారితీయగా, దాడిలో మృతిచెందినట్లు తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.