హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం

NRPT: ప్రజలు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కోరారు. ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బాధితులు తమ సమస్యలు, ఫిర్యాదులను 0850-6281182 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.