హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్ములమ్మ ఆలయంలో ప్రత్యేక అలంకరణ

GDWL: గద్వాల పట్టణ సమీపంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణ నిర్వహించారు. వేకువజామున అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం చేసి, పట్టువస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. మంగళవారం కావడంతో గద్వాల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.