PDPL: ధర్మారం మండల కేంద్రంలో సోమవారం విలేకరులతో మాట్లాడిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎన్నికల్లో ఇచ్చిన పింఛన్ల పెంపు హామీని ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేయలేదని విమర్శించారు. కొత్త పింఛన్ల మంజూరు పేరిట ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టిస్తోందన్నారు. వృద్ధాప్య పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచి కొత్త లబ్ధిదారులకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
పింఛన్ల పెంపు హామీ ఏది?: కొప్పుల ఈశ్వర్


