SRCL: కోనరావుపేట మండలం మామిడిపల్లి మూలవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను సోమవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. పెట్రోలింగ్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాములును చూసి డ్రైవర్ వేగంగా పారిపోయే ప్రయత్నం చేయగా, బ్రిడ్జి వద్ద ఇసుకలో కూరుకుపోయి టిప్పర్ బోల్తా పడింది. మల్కపేటకు చెందిన డ్రైవర్ కరుణాకర్‌ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణా టిప్పర్ బోల్తా.. డ్రైవర్ అరెస్ట్


