హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లీకేజీతో రోడ్డుపాలవుతున్న తాగునీరు

WGL: వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి సమీపంలో తాగునీటి పైపులైన్ లీకేజీ సమస్య స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రోజూ ఉదయం నీరు భారీగా రహదారిపై ప్రవహిస్తూ వృథా అవుతోంది. సమస్యను పలుమార్లు గమనించినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీటి కొరత ముప్పు ఉన్నందున తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు