హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్య బాధ భరించలేక వృద్ధురాలి ఆత్మహత్య

WGL:సంగెం మండలం రేఖియా నాయక్ తండాకు చెందిన బానోత్ పారి(84) అనారోగ్య బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నెల రోజుల క్రితం జారిపడటంతో ఆమె కుడిచేయి విరిగింది. అప్పటి నుంచి నొప్పితో బాధపడుతున్న ఆమె సోమవారం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మనవడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు.