హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి తాగుతున్న ఇద్దరి పట్టివేత

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గంజాయి తాగుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. మల్లంపల్లి గ్రామానికి చెందిన మేరుగు ఆకాశ్,పాలకుర్తికి చెందిన దయ్యాల యుగేందర్ సోమవారం సాయంత్రం గంజాయి తాగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఊర సృజన్ కుమార్ తెలిపారు. డ్రగ్ టెస్టులో ఇద్దరికీ పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.