హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 28న కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవం

HNK: కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం వెల్లడించారు. తెలంగాణ గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు.