హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ మోటార్లు, తీగల చోరీతో అన్నదాతల ఆందోళన

JN: రఘునాథపల్లి మండల కేంద్రంలో గుర్తుతెలియని దుండగులు పది మంది రైతులకు చెందిన వ్యవసాయ బోరు మోటార్లు, స్టార్టర్ వైర్లను చోరీ చేశారు. సోమవారం రైతులు వ్యవసాయ పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిన సమయంలో రాత్రి సమయంలో దుండగులు మోటార్ల వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్లారు. చోరీని గుర్తించిన రైతులు ఆందోళనకు గురయ్యారు.