BHPL: కాటారం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో బాపు (60) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన ఎడమ కన్నుకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది శ్వేత, పైలట్ ప్రణీత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అనంతరం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. వృద్ధుడికి తీవ్ర గాయాలు


