హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆఫ్‌లైన్‌లో రిజెక్ట్.. ఇక మీసేవలోనే!

HYD: ఇకపై గృహ, వాణిజ్య అవసరాలకు బోర్లు వేయాలంటే మీసేవ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో సమర్పించే దరఖాస్తులను స్వీకరించొద్దని భూగర్భ జలశాఖ సంచాలకుడు కె.లక్ష్మ అధికారులను ఆదేశించారు. జిల్లా భూగర్భ జలశాఖ అధికారులు మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు.