హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల పరిసరాల్లో పిచ్చి మొక్కలతో పొంచి ఉన్న ప్రమాదం

JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. రఘునాథపల్లి – జనగామ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పాఠశాల ఆవరణలో తరగతి గదుల పక్కనే మొక్కలు పెరగడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విష సర్పాలు సంచరించే అవకాశముందని అధికారులు స్పందించి పరిసరాలను శుభ్రం చేయించాలని ప్రజలు కోరారు.