హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు

HNK: ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి–దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. 07069 నంబర్ రైలు ఈ నెల 19న, 07070 నంబర్ రైలు 21న ఒక్కో ట్రిప్పు నడవనున్నాయి. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించినట్లు CPRO శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.