JN: పాలకుర్తి మండల కేంద్రంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నియోజకవర్గ న్యాయవాదులు వినతిపత్రం సమర్పించారు. న్యాయసేవల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, సమయం, ఆర్థిక భారం తగ్గించేందుకు పాలకుర్తిలోనే కోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలి'


