HNK: హసన్‌పర్తి మండలం పెంబర్తిలో సోమవారం పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరి శేఖర్, తీగల సమ్మయ్య, వల్లాల ఐలయ్య, నరహరి లక్ష్మారెడ్డి, వేముల రమేష్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 5 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మహేందర్ తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
పేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్ట్


