సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అకునూరులో తన కోడిని కారుతో తొక్కించి చంపారంటూ 63 ఏళ్ల పౌడాల రాములు, భార్యతో కలిసి చేర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటి ఆవరణలోనే కారు డ్రైవర్ మల్లోజుల రవికుమార్ నిర్లక్ష్యంగా నడిపాడని, ప్రశ్నించగా దుర్భాషలాడాడని ఆరోపించారు. ఎస్సై అపూర్వరెడ్డికి ఫిర్యాదు అందజేసి కఠిన చర్య కోరగా, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
కోడిని కారుతో తొక్కించాడని ఫిర్యాదు


