WGL: నర్సంపేటలోని వివేకానంద కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. చిట్టిమళ్ల బ్రహ్మచారి గత నెల 24న భార్యతో కలిసి హైదరాబాద్లోని కుమార్తె ఇంటికి వెళ్లి సోమవారం తిరిగి వచ్చారు. ఇంటి పైకప్పు రేకులు తొలగించి లోపలికి చొరబడిన దొంగలు బీరువా పగులగొట్టి రెండున్నర తులాల బంగారు నల్లపూసల గొలుసు, 12 తులాల వెండి పట్టీలు అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ఇంట్లో చోరీ.. బంగారం, వెండి ఆభరణాలు అపహరణ


