హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ నందీశ్వర విగ్రహ పనులను ప్రారంభించిన జగ్గారెడ్డి

SRD: కంది మండలంలోని బ్యాతోల్ శివారులో రూ.9 కోట్లతో నిర్మిస్తున్న భారీ సువర్ణ నందీశ్వర విగ్రహ పనులను TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, DCC మాజీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫసల్వాది సమీపంలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.